Friday, 12 September 2014

గవర్నర్‌తో కేసీఆర్ భేటీ.. విభజన చట్టం 9, 10 షెడ్యూల్ అంశాలపై చర్చ?

kcr - narasimhanరాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఏక బిగువున మూడు గంటలకు పైగా ఈ చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా వారు వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా.. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్‌లలో ఉన్న సంస్థల పంపకాలపై చర్చించినట్లు వినికిడి. పనిలోపనిగా ఏబీఎన్‌, టీవీ9 ప్రసారాల నిలిపివేతగా గవర్నర్ ఆరా తీయడంతో కేసీఆర్ వివరణ ఇచ్చి, వాటి ప్రసారాల పునరుద్ధరణపై కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. 
 
వీరిద్దరి మధ్య ఏకంగా మూడు గంటల పాటు చర్చలు జరిపారు. ఇంత సేపు భేటీ కావడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ చర్చల అనంతరం వారిద్దరు కలిసి భోజనం చేశారు. మరోవైపు.. గురువారం సాయంత్రం గవర్నర్‌తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సమావేశమై సుదీర్ఘ మంతనాలు నిర్వహించిన విషయం తెల్సిందే. శుక్రవారం గవర్నర్‌తో కేసీఆర్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే నెలలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, అధికారుల పంపిణీలతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం, విభజన సందర్భంగా ఏర్పడ్డ సమస్యలు తదితర అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. 

No comments:

Post a Comment