Friday, 12 September 2014

మెదక్ ఉపఎన్నిక నేపథ్యంలో తనిఖీలుచేపట్టాం: డీసీపీ

మెదక్: మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల నేపథ్యంలో పలుచోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నామని బాలానగర్ డీసీపీ వెల్లడించారు. ఈమేరకు శామీర్‌పేట, మేడ్చల్ ప్రాంతాల్లో చెక్‌పోస్టులు కూడా ఏర్పాటు చేశామన్నారు. తమకు అందిన పక్కా సమాచారం మేరకు శామీర్‌పేటలోని హనీబర్గ్ రిసార్ట్‌లో సోదాలు నిర్వహించామని ఈ సోదాల్లో ఒక రాజకీయ నేతకు చెందిన వాహనం నుంచి పెద్ద మొత్తంలో డబ్బుతోపాటు బ్యాలెట్ పేపర్లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఇన్నోవా వాహనం గజ్వేల్ టీడీపీ ఇన్‌ఛార్జీ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి కుమారుడు విజయేందర్‌రెడ్డిదిగా గుర్తించామని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్త చేస్తున్నామని తెలిపారు.

No comments:

Post a Comment