Thursday, 11 September 2014

విజయమ్మకు భద్రత ఇవ్వండి

మాజీ ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మకు, కుమార్తె షర్మిల, అల్లుడు అనిల్ లకు భద్రత కొనసాగించాలని హైకోర్టు ఎపి ప్రబుత్వాన్ని ఆదేశించింది.తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు వారికి భద్రత కొనసాగించాలని కోర్టు స్పష్టం చేసింది. మాజీ ఎమ్మెల్యే కూడా అయిన విజయమ్మ తన భద్రతను ఉపసంహరించడం సరికాదని, తనకు ప్రాణహాని ఉందని ఆమె హైకోర్టును ఆశ్రయించారు.గతంలో మాదిరి 2+2 భద్రత కొనసాగించాలని ఆమె కోరగా కోర్టు తదనుగుణంగా ఆదేశాలు ఇచ్చింది. ఆదే విదంగా షర్మిల, అనిల్ లకు సెక్యూరిటీ కొనసాగించాలని కోర్టు ఆదేశించింది.

No comments:

Post a Comment