Thursday, 11 September 2014

ఢిల్లీలో భాజపాకు ఛాన్స్ ఇవ్వాలి... షీలా, హస్తం చేతికి చేదు గుళిక

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ సీఎం షీలా దీక్షిత్ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భాజపాకు అవకాశం ఇవ్వాలంటూ ఆశ్చర్యకర ప్రకటన చేసి కాంగ్రెస్ పార్టీకి గట్టి షాకిచ్చారు. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్ఠంభన కొనసాగుతున్న నేపథ్యంలో షీలా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
 
ఢిల్లీలో షీలా మాట్లాడుతూ... ఆప్ కూలింది కనుక ఆ తర్వాత పెద్ద పార్టీ భాజపా అనీ, దానికి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వం ఏర్పాటైతే తాను ఎంతగానో సంతోషిస్తానంటూ పేర్కొన్నారు.

No comments:

Post a Comment