Thursday, 11 September 2014

వైఎస్ విజయమ్మ, షర్మిల, బ్రదర్ అనిల్‌లకు హైకోర్టులో ఊరట!

వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆమె కుమార్తె వైఎస్ షర్మిల, షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్‌కు రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. వీరికి ఇప్పటి వరకు కల్పిస్తూ వచ్చిన భద్రతను మున్ముందు కూడా కొనసాగించాలని గురువారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెతోపాటు వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ కు కూడా భద్రత కొనసాగించాలని కోర్టు దేశించింది. మళ్లీ ఉత్తర్వులు ఇచ్చేవరకు వారికి భద్రత కొనసాగించాలని కోర్టు తెలిపింది.
 
నిజానికి వైఎస్ విజయమ్మకు ఉన్న 2+2 భద్రతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే ఉపసంహరించుకుంది. ఈ నిర్ణయంపై విజయమ్మ హైకోర్టును ఆశ్రయించారు. భద్రతను వెంటనే పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్ లో ఆమె కోరారు. ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్రస్థాయి భద్రతా సమీక్ష కమిటీ, వైఎస్ఆర్  జిల్లా ఎస్ పీ, ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. 
 
ఈ పిటీషన్‌లో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని, భద్రత ఉపసంహరించే ముందు తమకెటువంటి నోటీసు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. తనకు ప్రాణహాని ఉందంటూ గత నెల 31న ఇంటెలిజెన్స్ అదనపు డీజీకి వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. 2004 నుంచి ఉన్న భద్రతను ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే తొలగించడం వెనుక రాజకీయ దురుద్దేశాలున్నాయని తెలిపింది. అటు వైఎస్ జగన్ సోదరి షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్ కూడా తమ భద్రత ఉపసంహరణపై వేర్వేరుగా కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. 

No comments:

Post a Comment