Thursday, 11 September 2014

నా ద్వారా కేసీఆర్‌ను దెబ్బకొట్టేందుకు కుట్ర : టి రాజయ్య

rajaiahకొందరు తనపై భుజంపై తుపాకీ పెట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దెబ్బకొట్టేందుకు కుట్ర పన్నుతున్నారని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి టి రాజయ్య వ్యాఖ్యానించారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని కేసీఆర్ అన్నారు తప్ప కించ పరిచేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఆయన వివరణ ఇచ్చారు. 
 
కానీ, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ లేనిపోని విషయాలు చెబుతున్నారని ఆయన అన్నారు. కేసీఆర్‌ తనకు తండ్రి లాంటి వాడని, కొడుకునని భావించే తనను కేసీఆర్‌ మందలించారని రాజయ్య సమర్ధించారు. తండ్రి లాంటి కేసీఆర్‌ మందలిస్తే తప్పేంటని రాజయ్య ప్రశ్నించారు. మంద కృష్ణ ఎన్నడైనా తెలంగాణ పునర్నిర్మాణానికి ఉపయోగపడ్డారా అని రాజయ్య ప్రశ్నించారు.

No comments:

Post a Comment