Friday, 12 September 2014

మగబిడ్డ కోసం భార్యతో గొడవ: పురుషాంగాన్ని కోసేసుకున్న భర్త!

మగ బిడ్డ కావాలంటూ భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి (30) తీవ్ర అసహనానికి గురై కత్తితో తన పురుషాంగాన్ని తానే కోసేసుకున్నాడు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని సివాన్ జిల్లా ఖోజ్వా గ్రామంలో చోటు చేసుకోగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వివరాలను పోలీసుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. 
 
కాగా, ఖతార్ దేశంలో ఉద్యోగం చేస్తున్న బాధితుడు, నెల రోజులపాటు సెలవుపెట్టి ఇటీవలే తన స్వస్థలం బీహార్ రాష్ట్రానికి వచ్చాడు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మగబిడ్డ మాత్రం లేడు. ఇదే విషయంపై అతడికి, అతని భార్యకు తరచూ గొడవ జరుగుతుండేది. గురువారం కూడా భార్యాభర్తలిద్దరూ గొడవపడ్డారు. తీవ్ర వాగ్వాదం అనంతరం ఆగ్రహానికి, అసహనానికి గురైన అతడు తన పురుషాంగాన్ని పదునైన కత్తితో కోసేసుకున్నాడు. 
 
దీంతో వెంటనే అతడిని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు అతని బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతని పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. 

No comments:

Post a Comment