Saturday, 13 September 2014

చింతమడకలో ఓటేసిన సీఎం కేసీఆర్‌

సంగారెడ్డి: మెదక్‌ ఉప ఎన్నికకు పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. తన స్వగ్రామమైన చింతమడకలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి ఓటు వేశారు. రామాయంపేట మండలం కోనాపూర్‌లో డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రి హరీష్‌రావు తన కుటుంబ సభ్యులతో కలిసి సిద్ధిపేటలో ఓటు వేశారు. దుబ్బాక మండలం పోతారంలో టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, శివ్వంపేట మండలం గోమారంలో కాంగ్రెస్‌ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి, సంగారెడ్డిలో బీజేపీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్థి జగ్గారెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

No comments:

Post a Comment