న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4 : రాజధాని ఎంపికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం సమర్ధిస్తుందని కేంద్రపట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. కేంద్రం అన్నివిధాల సహకరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక నిర్ణయాన్ని మేం మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికే వదిలి పెట్టామని అన్నారు.
ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ... రాష్ట్ర రాజధానిపై నిర్ణయం తీసుకోలేదని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. రాజధానిపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, అక్కడి అసెంబ్లీ తీర్మానాన్ని మేం గౌరవిస్తున్నామని ఆయన అన్నారు. కేంద్ర సహకారానికి సంబంధించి కసరత్తు జరుగుతోందని వెంకయ్యనాయుడు వెల్లడించారు. ఆర్థిక శాఖ ఈ అంశాన్ని పరిశీలిస్తోందని ఆయన అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కలిశారని, కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్రం చేయూత ఇస్తుందని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.
No comments:
Post a Comment