తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు ఉన్నప్పటికీ.. దాన్ని తీర్చేందుకు అవసరమైన చర్యలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టడం లేదని కేంద్ర విద్యుత్ శాఖామంత్రి పియూష్ గోయల్ ఆరోపించారు. తమతమ రాష్ట్రాల్లో ఉన్న విద్యుత్ కష్టాలు, కరెంట్ కోతలపై దేశంలో 17 రాష్ట్రాల సీఎంలు సంప్రదించారని, కానీ, కేసీఆర్ మాత్రం చర్చించలేదని, టి ప్రభుత్వం తరపున ఒక ప్రతినిధి మాత్రం తనను కలిశారన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి చాలా బిజీ అని, ఆయన తమను కరెంట్ కావాలని అడగనే లేదన్నారు. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాలకు త్వరలోనే 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ అడిగితే తెలంగాణలో కూడా విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు గోయల్ చెప్పారు. విద్యుత్ విషయంలో తాము రాజకీయాలు చేసే ప్రసక్తి లేదని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశారు
తెలంగాణలో కూడా విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు గోయల్ చెప్పారు. థర్మల్ విద్యుత్ ఉత్పాదనను తాము 15 శాతం పెంచామని, బొగ్గుగనుల కేటాయింపు రద్దు చేసినంత మాత్రాన థర్మల్ విద్యుత్ ఉత్పాదనకు వచ్చిన నష్టమేమీ లేదని ఆయన అన్నారు. విద్యుత్ విషయంలో తాము రాజకీయాలు చేసే ప్రసక్తి లేదని పియూష్ గోయల్ స్పష్టం చేశారు.
No comments:
Post a Comment