ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ 9 చానళ్లను ప్రసారాల నిలిపివేతపై తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుతో మాట్లాడతానని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. వందరోజుల పాలనలో తమ శాఖ చేపట్టిన కార్యక్రమాలపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమతమ రాష్ట్రాల అభివృద్ధిపై దృష్టి సారించారంటూ వారిని అభినందించారు.
ఇటీవల కేసీఆర్ తమతో భేటీ అయ్యారని, ఈ సందర్భంగా టీవీ చానెళ్లపై ఆయనతో చర్చించానన్నారు. కానీ రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీకి తర్వాతే.. మీడియాను బెదిరిస్తూ కేసీఆర్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించడంపై కేంద్ర హోం మంత్రి స్పందిస్తూ.. దీనిపై కేసీఆర్‌తో మరోసారి మాట్లాడతానని చెప్పారు.
తెలంగాణలో నిర్వహించిన సమగ్ర సర్వేపై పలు విమర్శలు వచ్చాయని, దానిపై కేంద్రం స్పందన ఏమిటని ప్రశ్నించగా..గణాంకాల కోసం సర్వే చేసి ఉండవచ్చునని అన్నారు.
మీడియాపై వరంగల్ సభలో కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో దుమారం రేపుతున్నాయి. కేసీఆర్ తీరుపై కొన్ని జాతీయ మీడియా సంస్థలు గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే.
No comments:
Post a Comment