మెదక్ లోక్‌సభకు జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేస్తున్న జగ్గారెడ్డి అలియాస్ తూర్పు జయప్రకాష్ రెడ్డి గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని తెలంగాణ రాష్ట్ర మంత్రి టి హరీష్ రావు ప్రటించారు. కరుడుగట్టిన సమైక్యవాది జగ్గారెడ్డికి బీజేపీ టిక్కెట్ ఇచ్చినపుడే ఆ పార్టీకి ఓటమి ఖరారై పోయిందన్నారు.
మెదక్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్ పార్లమెంట్‌కు జరగబోయే ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీలో ఏ పార్టీ గెలిచినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. మెదక్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తుందన్నారు. మెదక్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌ని గెలిపించడానికి ఇప్పటికే ఓటర్లు నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు.
No comments:
Post a Comment