chandra babu naiduఆంధ్రప్రదేశ్‌ రాజధాని గురించి జరుగుతున్న అన్ని చర్చలకు బ్రేక్‌ పడిరది. ఎక్కడ రాజధాని, ఎలా రాజధాని అంటూ అనేక ప్రశ్నలు సాధారణ జనాల్లో మెదులుతూ ఉండేవి. నేడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటన చేయడంతో ఆ ప్రశ్నలన్నింటికి సమాధానం లభించినట్లయ్యింది. ముందు నుండి అనుకుంటున్నట్లుగానే రాజధానిగా విజయవాడ పరిసర ప్రాంతాలను ఎంపిక చేసినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈనెల 1న మంత్రి వర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుని నేడు అసెంబ్లీలో ప్రకటన చేస్తున్నట్లు బాబు ప్రకటించారు.
రాజధాని ప్రకటన సందర్బంగా అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ… భూ సమీకరణ ద్వారా రాజధాని ఏర్పాటు చేయబోతున్నాం. విజయవాడ పరిసర ప్రాంతాలు రాజధాని అవసరాలకు భూ సేకరణకు ఉపసంఘంఉపయోగపడుతాయి. భూ సేకరణ కోసం ఒక ఉప సంఘాన్ని ఏర్పాటు చేయనున్నాం. రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించేందుకు ప్రజల సంక్షేమం మరియు సౌలభ్యం కొరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
రాబోయే రోజుల్లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఒక్కో సంవత్సరం ఒక్కో జిల్లాలో నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను అభివృద్ది పథంలో నడిపించడమే మా లక్ష్యం. మెగా సిటీలు, స్మార్ట్‌ సిటీలను ఏర్పాటు చేసి అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు.
ys jaganఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా విజయవాడ పరిసర ప్రాంతాలను ఎంపిక చేయడాన్ని మనస్పూర్తిగా స్వాగతిస్తున్నామని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని ప్రకటన తర్వాత ప్రతిపక్ష నేత హోదాలో మాట్లాడిన వైఎస్‌ జగన్‌ రాజధాని విషయంలో తమ పార్టీ వైఖరినీ తెలియజేశారు.
ఇదిలా ఉండగా, ఈ సందర్బంగా జగన్‌ మాట్లాడుతూ.. విజయవాడను రాజధానిగా అంగీకరిస్తున్నాం. కాని రాజధాని ఎంపిక విధానాన్ని మాత్రం తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. సభలో చర్చ జరపకుండా ఏక పక్షంగా రాజధాని ఎంపిక జరిగిందని, ప్రతిపక్షం వాదనలు వినకుండా రాజధానిగా విజయవాడను స్వాగతిస్తున్నాం రాజధాని ఎంపిక ఎలా చేస్తారంటూ జగన్‌ ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకమని ఆయన ఈ సందర్బంగా అన్నారు. వైకాపా మొదటి నుండి కూడా రాజధాని అందరికి అందుబాటులో ఉండాలని కోరుకుంటుందని, సామాన్యుడు కూడా రాజధానికి వచ్చేలా ఉండాలనేది తమ అభిమతమని జగన్‌ అన్నారు. రాజధాని అవసరాల కోసం 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాలనేది వైకాపా ఉద్దేశ్యమని జగన్‌ చెప్పుకొచ్చారు.