Saturday, 13 September 2014

మహారాష్ట్ర, హర్యానాలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల.. కాశ్మీర్, జార్ఖండ్‌లో

12-vs-sampath-yavraj-amithshaమహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికల నగారా మోగింది. కాగా, క్రికెటర్ యువరాజ్ సింగ్ బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షాను శుక్రవారంనాడు కలుసుకున్నారు. హర్యానా శాసనసభ ఎన్నికల్లో యువరాజ్ సింగ్ ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు అమిత్ షాకు యువరాజ్ సమాచారం ఇచ్చారు.
 
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం భారత ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మహారాష్ట్రలో 288 శాసనసభా స్థానాలకు, హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషనర్ (సిఈసి) వీఎస్ సంపత్ వెల్లడించారు.
 
శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన ఎన్నికల షెడ్యూల్‌ను వివరించారు. ఈ నెల 20న రెండు రాష్ట్రాల్లోనూ నోటిఫికేషన్ వెలువడుతుందని, నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 27 చివరి తేదీ అని చెప్పారు. అక్టోబర్ 15న రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ జరుగుతుందని, 19న ఓట్ల లెక్కింపు ఉంటుందని సంపత్ వివరించారు.
 
'నోటా' సౌకర్యంతో పాటు ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు గట్టి భద్రత ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న విషయం తెల్సిందే. జమ్మూ కాశ్మీర్ ఎన్నికలపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని సంపత్ చెప్పారు. వరదల కారణంగా అక్కడ ఎన్నికలు నిర్వహించలేని స్థితి ఉందని తెలిపారు.

No comments:

Post a Comment