Saturday, 13 September 2014

నరేంద్ర మోడీ కలిసిన సానియా మీర్జా : మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలిచినందుకు

టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. యుఎస్ ఓపెన్ టోర్నమెంట్‌లో మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలుచుకున్న తర్వాత ఆమె మోడీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సానియాకు మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
 
తనకు మద్దతు, ప్రోత్సాహం ఇచ్చినందుకు సానియా మీర్జా మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానితో భేటీలో సానియా మీర్జాతో పాటు ఆమె తల్లి నసీమా మీర్జా కూడా పాల్గొన్నారు. భారత టెన్నిస్ క్రీడాకారిణి, 2014 యుఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ విజేత సానియా మీర్జా ప్రధానిని కలిశారని పిఐబి ప్రకటన వెలువరించింది.
 
సానియాను అభినందిస్తూ మోడీ ట్విట్ చేశారు. యుస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో విజయం సాధించిన సానియా మీర్జాకు అభినందనలు అని, ఈ విజయానికి తాము గర్విస్తున్నామని మోడీ తన ట్విట్టర్‌లో రాశారు. సానియా మీర్జా మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.

No comments:

Post a Comment