Thursday, 11 September 2014

ఎంసెట్ రెండో విడత కౌన్సిలింగ్‌కు సుప్రీం కోర్టు నో!

ఎంసెట్ రెండో విడత కౌన్సిలింగ్‌కు సుప్రీంకోర్టు నో చెప్పేసింది. మొదటి విడత కౌన్సిలింగ్ తర్వాత 65 వేలకు పైగా ఇంజనీరింగ్ సీట్లు ఖాళీ ఉన్నాయని... అందుచేత రెండో విడత కౌన్సిలింగ్‌కు అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ ఉన్నతవిద్యామండలి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 
 
అయితే, ఉన్నతవిద్యామండలి అభ్యర్థనను సుప్రీంకోర్టు నిరాకరించింది. కౌన్సిలింగ్ గడువు పొడగింపుపై తమకు ముందే ఎందుకు చెప్పలేదని ఉన్నత విద్యామండలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మొదటి విడత కౌన్సిలింగ్ షెడ్యూల్‌నే యథావిదిగా కొనసాగించాలని కోర్టు ఆదేశించింది.

No comments:

Post a Comment