హైదరాబాద్ : డిస్నీ. ఈ పేరంటే ప్రపంచ వ్యాప్తంగా పిల్లలకు, పిల్లల మనసున్న పెద్దలకు ఎంతో ఇష్టం. కార్టూన్ సీరియల్స్ మొదలు టాయ్స్, యానిమేషన్ ఫిల్మ్స్, స్టూడియోస్ ఇలా డిస్నీ ఏం చేసినా అది పిల్లల కోసమే. మొదట్లో డిస్నీ రూపొందించిన కార్టూన్ సీరియళ్లు టెలివిజన్ రంగంలో చరిత్ర సృష్టిస్తే, ఆ తర్వాత యానిమేషన్ సినిమాలు బాక్సాఫీస్ రికార్డులు తిరగ రాశాయి. పిల్లల్లో తన బ్రాండ్ మీదున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు, ప్రతి హాలిడే సీజన్ కు సరికొత్తగా సిద్ధమవడం డిస్నీకి అలవాటు. పిల్లల నవ్వులే స్ఫూర్తిగా, క్రియేటివిటీ ఊపిరిగా వందేళ్ల ప్రయాణం సాగిస్తోంది డిస్నీ.
కింగ్ డమ్ హార్ట్స్ 2.5 గేమ్ విడుదల..
ఇయర్ ఎండ్ వస్తుందంటే ప్రపంచమంతా పండగ సీజన్ మొదలవుతుంది. విదేశాల్లో క్రిస్టమస్ సందడిని రెట్టింపు చేసేందుకు డిస్నీ కొత్త యానిమేషన్ గేమ్ ను రిలీజ్ చేస్తోంది. కింగ్ డమ్ హార్ట్స్ సిరీస్ 3 సిరీస్ లో 2.5 వర్షన్ ను మార్కెట్ లోకి తెస్తోంది. ఉత్తర అమెరికాతో పాటు మొత్తం యూరప్ అంతటా డిసెంబర్ మొదటి వారంలో కింగ్ డమ్ హార్ట్స్ 2.5 గేమింగ్ వర్షన్ బాలల చేతుల్లోకి రాబోతోంది.
నవంబర్ లో డిస్నీ త్రీడీ సూపర్ హీరో సినిమా..
డిస్నీ రూపొందిస్తున్న త్రీడీ సూపర్ హీరో ఫిల్మ్ బిగ్ హీరో 6 నవంబర్ ఫస్ట్ వీక్ లో విడుదలవుతోంది. మార్వెల్ కామిక్స్ సూపర్ హీరో అనుకరణతో డిస్నీ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. తాను క్రియేట్ చేసిన క్యారెక్టర్ కాకుండా మరో కామిక్ క్యారెక్టర్ తో డిస్నీ సినిమా చేయడం ఇదే తొలిసారి. హమడా అనే బాలుడు తన రోబో బేమ్యాక్స్ తో కలిసి ఫ్రాన్సోక్యో నగరంలోని నేరగాళ్ల ఆట ఎలా కట్టించారనేది బిగ్ హీరో 6 కథాంశం.

No comments:
Post a Comment