యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రస్తుతం “విశ్వరూపం 2″ చిత్రీకరణతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 2013లో బ్లాక్ బస్టర్ హిట్ “విశ్వరూపం” సినిమాకి ఇది సీక్వెల్. “విశ్వరూపం”లో నటించిన పూజాబోస్, ఆండ్రియాలు ఈ సినిమాలో కూడా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఒకేసారి తమిళ్, హిందీ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ కి శృతి హాసన్ ని అప్రోచ్ చేశారట.
అయితే, శృతి హాసన్ ఈ సినిమాలో ఐటెం సాంగ్ పై ఆసక్తి చూపనట్టు సమాచారం. “శృతి హాసన్ పూర్తి స్థాయి పాత్రల మీద దృష్టి పెడుతుందని, “విశ్వరూపం 2″ సినిమాలో ఐటెం సాంగ్ చేయడంపై తనకు ఆసక్తి లేద”ని శృతి హాసన్ సంబంధిత వర్గాలు తెలిపాయి.
మరో పక్క శృతి హాసన్ కి “విశ్వరూపం 2″ కథ నచ్చలేదన్న కారణంతోనే ఐటెం సాంగ్ చేయడానికి ఇష్టపడలేదనే వార్తలు కోలీవుడ్ లో హల్చల్ చేస్తున్నాయి. శృతి హాసన్ ఈ వార్తలను ఖండించింది.’ నేనుఐటెం సాంగ్ చేయనన్న శృతి హాసన్భవిష్యత్తులో కచ్చితంగా మా నాన్నగారితో కలిసి నటిస్తాను, “విశ్వరూపం 2″ సినిమాని మా నాన్నగారు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారన్న నమ్మకం నాకు ఉంది” అంటూ చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉంటే, కమల్ హాసన్ నటించిన “విశ్వరూపం” సినిమా 2013లో విడుదలై, 100 కోట్లను కలెక్ట్ చేసింది. దాంతో కమల్ అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
No comments:
Post a Comment