Friday, 12 September 2014

నందిగామ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం!

కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి శనివారం జరగనున్న ఉప ఎన్నికకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఓటింగ్ జరిగే నియోజకవర్గంలోని ప్రతి మండలానికి ఒక డిఎస్పీ, 129 కేంద్రాలలో వెబ్‌‌కాస్టింగ్‌ ద్వారా ఎన్నికలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 
 
గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందిన తంగిరాల ప్రభాకర్ హఠాన్మరణంతో ఇక్కడ ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా తంగిరాల సౌమ్య పోటీ చేస్తుండగా, వైకాపా పోటికి దూరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం బాబూ రావు అనే అభ్యర్థిని పోటీకి దించింది. 

No comments:

Post a Comment