బస్‌స్టేషన్లకు ఆస్ర్టేలియా హంగులు కల్పిస్తాం
- ఈ నెలాఖరుకల్లా కార్మికులకు దసరా అడ్వాన్సులు
- రోడ్ల మరమ్మతులకు రూ.240 కోట్లు : మంత్రి శిద్దా
హైదరాబాద్, సెప్టెంబర్ 11(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రతిపాదించామని రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. ముఖ్యమంత్రి అనుమతి ఇస్తే చార్జీలు పెంచుతామని చెప్పారు. పెరిగిన డీజిల్ ధరలకు అనుగుణంగా బస్ చార్జీలు పెంచకపోవడంతో ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని చెప్పారు. ఆసే్ట్రలియా, పోలెండ్‌లలో మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లో బస్‌స్టేషన్లను సౌకర్యవంతంగా మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన వెల్లడించారు. ఆయా దేశాల్లోని బస్‌స్టేషన్లను అధ్యయనం చేసేందుకు త్వరలో కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. గురువారం సచివాలయంలో ఆర్టీసీ యూనియన్ నాయకులతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఆస్ర్టేలియా, పోలెండుల్లో ఫ్లాట్‌ఫారాలు బస్‌స్టేషన్ కిందభాగంలో ఏర్పాటుచేసి పైన మల్టీఫ్లెక్స్ థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మిస్తారని చెప్పారు. ఆ విధానం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి ఎంతగానో నచ్చి వాటిని పరిశీలించి రావాలని చెప్పారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, విజయవాడ, విశాఖపట్నంలలో ఆ విధానంలో బస్టాండులు నిర్మించే ఆలోచనలో ఉన్నామన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తారని చాలామంది అభిప్రాయపడుతున్నారని కానీ తమ ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేదని మంత్రి స్పష్టం చేశారు. రాబోయే 6 నెలల్లో 1000 బస్సులు కొనుగోలు చేస్తామన్నారు. దసరా పండుగ అడ్వాన్స్‌ను ఈ నెలాఖరుకల్లా అందజేసి, డీఏ కూడా ఇస్తామని మంత్రి తెలిపారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిగిన నేపథ్యంలో వారికి రూ.250 కోట్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందన్నారు. రహదారుల మరమ్మతులకు రూ.240 కోట్లు కేటాయించామన్నారు. అత్యంత ప్రమాదాలు (బ్లాక్ స్పాట్స్) జరిగే ప్రాంతాలపై ప్రతే ్యక శ్రద్ధపెట్టి ప్రమాదాలు నివారించేందుకు కృషి చేస్తామన్నారు.
కాగా, ఆర్టీసీ దాదాపు 5000 కోట్ల అప్పులు, నష్టాల్లో ఉందని ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.పద్మాకర్ చెప్పారు. దీనిని ముఖ్యమంత్రికి వివరించగా రూ.250 కోట్లు ఆర్థికసాయం అందించారని, ఈ సహాయంతో ఆర్టీసీ రెండు నెలలు మనుగడ సాఽగిస్తుందే తప్ప శాశ్వత పరిష్కారం కాదన్నారు.

No comments:
Post a Comment