హైదరాబాద్:ఒకవైపు ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ గందరగోళం... మరోవైపు ఉద్యోగాల నోటిఫికేషన్‌లో జాప్యం...ఇంకొవైపు క్లారిటీ లేని కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ...రాష్ట్రాలు వేరైనా తెలుగు ప్రాంతాల్లో ఉమ్మడి సమస్యలివి. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలను గజగజ వణికిస్తున్న కీలకసమస్యలు. కొత్త రాష్ట్రాల్లో కొలువు దీరిన పాలకులకు మాత్రం భవిష్యత్ నిర్దేశకులు కనిపించడం లేదు.
ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ గందరగోళం.....
పాలకుల వైఖరితో తెలుగు విద్యార్థులు క్షోభకు గురవుతున్నారు. భవిష్యత్ డాక్టర్లు, ఇంజినీర్లు అయోమయంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల చరిత్రలోనే తొలిసారిగా తొలివిడత కౌన్సెలింగ్‌తోనే సీట్ల భర్తీ నిలిచిపోయింది. మలిదశ ప్రవేశాలకు అత్యున్నత న్యాయస్థానం అనుమతి నిరాకరించింది. కనీసం నాలుగైదు రోజులైనా అనుమతి ఇవ్వాలని అడిగింది. కానీ ధర్మాసనం మాత్రం ససేమిరా అంది. ఆగస్టు 31లోగా ప్రవేశాలు పూర్తి చేసి సెప్టెంబర్ 1 నుంచి తరగులు ప్రారంభిస్తామని మీరే చెప్పారు. ఇప్పుడు రెండో విడత అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అవును సుప్రీం కోర్టు సీరియస్ కావడంలో అర్థం ఉంది. అత్యున్నత న్యాయస్థానం అంతలా సీరియస్ అవడానికి కారణమెవరు..? అభంశుభం తెలియని విద్యార్థుల జీవితాలతో ఆటలాడిందెవరు..? పంతాలకు పోయిన పాలకుల్లారా..! మాకేం సమాధానం చెబుతారంటూ తెలుగు విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.
ఉద్యోగాల నోటిఫికేషన్‌లో జాప్యం...
మరోవైపు ఉద్యోగాల భర్తీపై ఇరురాష్ట్రాల్లోనూ నీలినీడలు కమ్ముకున్నాయి. కొత్తరాష్ట్రం వస్తే కొలువులు వస్తాయన్న లీడర్లు... ఇప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయాలంటే భయపడుతున్నారు. ఖాళీల్లేవ్... ఖజనా లేదంటూ కబుర్లు చెబుతున్నారు. తెలంగాణలో పరిస్థితి దారుణంగా ఉంది. కేవలం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేశారు తప్ప టిఎస్ పిఎస్ సిసభ్యుల నియామకాన్ని పూర్తి చేయలేదు. ఖాళీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వేయలేదు. దీంతో ఒకప్పుడు అండగా ఉన్న విద్యార్థులే ఇప్పుడు పోరుబాట పట్టారు.
ఏపీ ప్రభుత్వ చిత్తశుద్ధిపైనే అనుమానం...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం తానేం తక్కువ కాదంటోంది. డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల సస్పెన్స్ థిల్లర్ మూవీని తలపిస్తోంది. ఇప్పటికే డీఎస్సీపై విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు ఊరిస్తున్నారు. ఊదరగొడుతున్నారు. రేపో, మాపో అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. కానీ ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడటం లేదు. బీఈడీ విద్యార్థులకు ఎస్ జిటీ లో అవకాశమిస్తామని ఎన్నికల ప్రచారంలో బాబు హామీ ఇచ్చారు. అందుకే నోటిఫికేషన్ ఆలస్యం అవుతోందని అంటున్నారు. దీంతో ప్రభుత్వ చిత్తశుద్ధిపైనే అనుమానం కలుగుతోంది. సెప్టెంబర్ 5న నోటిఫికేషన్ అంటూ గొప్పలు చెప్పిన ఈ నేతలకు ఎస్ జిటీ, బీఈడీ విద్యార్థులు గుర్తుకు రాలేదా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పోరుబాటపట్టిన విద్యార్థులను పట్టించుకోని ప్రభుత్వాలు ...
ఒకప్పుడు అటు సమైక్యాంధ్ర ఉద్యమం... ఇటు ప్రత్యేకతెలంగాణ ఉద్యమంలో పోరుబాటపట్టిన వీరులకు విలువ ఇవ్వడం లేదు. ఓ పక్క చదువు... మరో పక్క ఉద్యమం... ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ... విద్యార్థులు పోరాటాలు సాగించారు. తమతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోతాయన్న నానుడిని నిజం చేశారు. ఉవ్వెత్తున ఎగసిపడ్డ ఉద్యమాలకు విద్యార్థులే వెన్నుదన్నుగా నిలిచారు. లాఠీలు ఝుళిపించినా.. తుపాకులు పేల్చినా ఆందోళనలు తగ్గలేదు. అలాంటి విద్యార్థులను ఇప్పుడు పాలకులు పక్కన పెడుతున్నారు. ఇదే జరిగితే భవిష్యత్‌లో ఉద్యమాలు తప్పవని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ఇరురాష్ట్రాల పాలకుల్లో కదలిక వస్తుందో లేదో చూడాలి.

No comments:
Post a Comment