Monday 17 November 2014

స్వాతంత్ర్యం కోసం ఉరికంబం ఎక్కలేదన్న బాధ ఉంది

సిడ్నీ :  భారత ప్రధాని నరేంద్ర మోదీకి ...సిడ్నీలో ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు నిర్వాహకులు వేద మంత్రాలు, పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతించారు. సిడ్నీలోని ఒలింపిక్ పార్క్ స్టేడియంలో మోదీ ప్రసంగించారు. ముందుగా ఆయన తన ప్రసంగాన్ని ముందుగా ఇంగ్లీష్ లో ప్రారంభించి అనంతరం హిందీలో మాట్లాడారు.  సిడ్నీలో ఈ వాతావరణం చూస్తుంటే ఎంతో ఉత్సాహం కలుగుతోందన్నారు.  మీ ప్రేమ, స్వాగతం 123 కోట్ల భారతీయులకు అంకితమిస్తున్నట్లు మోదీ తెలిపారు. 50 ఏళ్ల క్రితమే స్వామి వివేకానందుడు తన ఆలోచనలను ప్రపంచానికి అందించారని ఆయన అన్నారు.

ప్రపంచమంతా ఒక్క తాటిపైకి రావాలని వివేకానందుడు పిలుపునిచ్చారని మోదీ పేర్కొన్నారు. స్వాతంత్ర భారతంలో పుట్టినందుకు సంతోషంగా ఉందన్నారు. స్వాతంత్ర్య సమరంలో తాను పాలుపంచుకోనందుకు బాధగా ఉందని ఆయన అన్నారు. దేశం కోసం మరణించే అవకాశం అందరికీ రాదని మోదీ పేర్కొన్నారు.  స్వాతంత్ర్యం కోసం ఉరికంబం ఎక్కలేదన్న బాధ ఉందని ఆయన అన్నారు.   భారత ప్రధాని ఆస్ట్రేలియా రావటానికి 28 ఏళ్లు పట్టిందని మోదీ తెలిపారు.

No comments:

Post a Comment