ముగ్గురు దుర్మరణం -
పెద్దాపురం, సెప్టెంబర్ 11: తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పట్టణ శివార్లలో గురువారం 108 అంబులెన్సు, ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు అంబులెన్స్ సిబ్బంది , మరొకరు ఆసుపత్రికి తరలిస్తున్న రోగి. రంగంపేట మండలం మర్రిపూడి గ్రామానికి చెందిన కాతేటి సత్తిబాబు (27) కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతూ వైద్య సహాయం కోసం 108 అంబులెన్స్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. అనపర్తికి చెందిన 108 వాహనం మర్రిపూడి చేరుకుని, బాధితుడిని జిల్లా కేంద్రం కాకినాడలోని ప్రభుత్వాసుపత్రికి తరలించడానికి బయలుదేరింది. పెద్దాపురం సమీపంలోని సుఘం ఆగ్రోటెక్ ఫ్యాక్టరీ సమీపంలో 108 వాహనం ముందు వెళుతున్న మరో వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న కాకినాడ - రాజమండ్రి ఆర్టీసీ పాసింజర్ బస్సును వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో 108 వాహనం ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. వాహనంలో తరలిస్తున్న రోగి సత్తిబాబు అక్కడికక్కడే మృతిచెందాడు. వాహనం పైలెట్ గా ఉన్న మేడిశెట్టి శ్రీనివాసరావు(38), టెక్నికల్ అసిస్టెంట్ తాటికొండ ఉమాశంకర్ (28) తీవ్రంగా గాయపడ్డారు. కాకినాడ తరలిస్తుండగా మార్గమధ్యంలో పైలెట్ శ్రీనివాసరావు మృతిచెందాడు. అసుపత్రిలో చికిత్స పొందుతూ ఉమాశంకర్ మృతిచెందారు.

No comments:
Post a Comment