Thursday, 4 September 2014

అసెంబ్లీలో 8 తీర్మానాలు: 4 నెలల్లో పోలవరం నిర్మాణం!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గురువారం 8 తీర్మానాలను ఆమోదించారు. ఏపిలో 13 జిల్లాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సభలో తీర్మానం చేశారు. రాజధానిగా విజయవాడ అభివృద్ధికి కేంద్రం సంపూర్ణ సహకారం అందించాలని కోరుతూ మరో తీర్మానం చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన ప్రతిపాదనలు, హామీలను కేంద్రం నెరవేర్చాలని సభ కోరింది.
 
అన్ని విధాలా ఏపికి సమన్యాయం చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరుతూ తీర్మానం చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఆర్థిక, విధానపరమైన మద్దతు అందించాలని సభలో మరో తీర్మానం చేశారు. 
 
నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సభ కోరింది. శాసన మండలి సీట్ల కేటాయింపులలో జరిగిన అన్యాయాన్ని సవరించి 58 సీట్లకు పెంచాలని ఇంకో తీర్మానం చేశారు.

No comments:

Post a Comment