Saturday, 13 September 2014

నందిగామ ఉప ఎన్నిక... 35 శాతం పోలింగ్‌

కృష్ణా: జిల్లాలోని నందిగామ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ నందిగామలో 35 శాతం పోలింగ్‌ నమోదైంది. ఎన్నిక బరిలో టీడీపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులతో పాటు.. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. టీడీపీ అభ్యర్థిగా తంగిరాల సౌమ్య, కాంగ్రెస్‌ తరపున బోడపాటి బాబురావు, స్వతంత్ర అభ్యర్థులుగా మాతంగి పుల్లారావు, కటారపు పుల్లయ్య ఉన్నారు. నందిగామ నియోజకవర్గంలో మొత్తం 200 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉప ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించేందుకు 15 వందల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు

No comments:

Post a Comment