Saturday, 13 September 2014

దుర్గమ్మ దసరా ఉత్సవ కమిటీ నియామకంపై లుకలుకలు..

విజయవాడ : ఈనెల 25వ నుండి అక్టోబర్ మూడో తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు కమిటీ నియామకంలో నేతల మధ్య లుకలుకలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా జిల్లా టిడిపిలో విబేధాలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఇతర పార్టీల నుండి వచ్చి టిడిపిలో చేరిన వారికి జిల్లాకు చెందిన ఓ మంత్రి ప్రాధాన్యత ఇస్తున్నారని టిడిపి నేతలు పేర్కొంటున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి చెవిలో వేసినట్లు సమాచారం. వెంటనే ఆ కమిటీని రద్దు చేయాలని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరోవైపు బీజేపీ కూడా కమిటీ నియామకంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నా కమిటీ నియామకంపై ప్రాధాన్యత ఇవ్వడం లేదని బీజేపీ నేతలు నొచ్చుకున్నట్లు సమాచారం. దీనిపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. జిల్లా మంత్రి ఏకపక్షంగా నియమాకాలు చేస్తున్నారని పేర్కొన్నట్లు సమాచారం. దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు విదేశీ పర్య

No comments:

Post a Comment