ఎపి రాజధాని ప్రజలందరికీ అందుబాబులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలని వక్తలు పేర్కొన్నారు. ఎపి రాజధాని, కేంద్ర ప్రభుత్వ సహాయం అనే అంశంపై శనివారం టెన్ టివి నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీనియర్ విశ్లేషకుడు వినయ్ కుమార్, బీజేపీ నేత రాంచంద్రరావు, టీడీపీ నేత పట్టాబీ రామ్ పాల్గొని, మాట్లాడారు. ప్రజలందరికీ ఉపయోగిపడే విధంగా ఎపి ప్రభుత్వం రాజధాని ఏర్పాటుపై దృష్టి పెట్టాలని వక్తలు సూచించారు. రాష్ట్ర విభజనను కేంద్రం ప్రత్యేక దృష్టితో చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎపి ఆశించిన స్థాయిలో నిధులను కేంద్రం ఇవ్వలేకపోవచ్చని కొందరంటే... కేంద్రం నుంచి ఎపికి అధిక నిధులు వస్తాయనే నమ్మకం ఉందని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఎపి రాజధాని నిర్మాణానికి చాలా కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
No comments:
Post a Comment