మెదక్ : జిల్లా పార్లమెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ముగిసింది. ఇప్పటి వరకు అందింన సమాచారం మేరకు 65.14 శాతం నమోదైనట్లు తెలుస్తోంది. ఇది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ ను సరళిని చూస్తే సుమారు 11 శాతం మేర తక్కువగా ఓటింగ్ నమోదైంది. దీనితో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు గట్టిగా విశ్వసిస్తున్నారు. భారీ మెజార్టీ సాధిస్తామని చెప్పినా విజయం మాత్రం సొంతం చేసుకుంటామని టిఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. టిఆర్ఎస్ పార్టీకి తాము గట్టిపోటీనిచ్చామని బీజేపీ పార్టీ నేత దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. దీనితో ఆ పార్టీ గెలుస్తుందని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. టిఆర్ఎస్ తరపున కొత్త ప్రభాకర్ రెడ్డి..కాంగ్రెస్ నుండి సునీతా లక్ష్మారెడ్డి..టిడిపి-బిజెపి తరపున జగ్గారెడ్డి బరిలో నిలుచున్న సంగతి తెలిసిందే.
No comments:
Post a Comment