హైదరాబాద్: ఓటు హక్కు చాలా విలువైనది...ప్రతి ఒక్కరూ ఓటు వేసి ఓటు హక్కును వినియోగించుకోవాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. మెదక్ లోక్ సభ ఉప ఎన్నికల్లో కుటుంబ సభ్యులతో కలసి ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ద్వారానే మన లక్ష్యాన్ని నెరవేర్చుకోగలుగుతామన్నారు. 2014 లో 77 శాతం ఓటు హక్కును వినియోగించుకున్న నియోజకవర్గ ప్రజలు ఈ సారి 95 శాతం ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తమ ఓటును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 11 గంటల ప్రాంతంలో సీఎం కేసీఆర్ తన స్వంత గ్రామం చింతమడక లో ఓటు హక్కును వినియోగించుకుంటారని తెలిపారు. ఎన్నికల కోడు దృష్ట్యా గెలుపు, ఓటముల గురించి ఏమీ మాట్లాడలేనని చెప్పారు.
No comments:
Post a Comment