హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పాలకుల పక్షం కాదని... ప్రజల పక్షమేనని ఎంపి కవిత స్పష్టం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ (టిఎస్ఎ) ను కవిత సమక్షంలో తెలంగాణ రాష్ట్ర స్టూడెంట్ విభాగం(టిఆర్ఎస్వి)లో విలీనం చేశారు. అంతకముందు విద్యార్థులు సంప్రదాయ నృత్యాలు, బతుకమ్మలతో ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగానే నడుచుకుంటుందన్నారు. యూనివర్శిటీలో నెలకొన్ని ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
No comments:
Post a Comment