జపాన్ లో అయిదు రోజుల పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చారిత్రాత్మక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దీంతో, జపాన్, భారత దేశాల మధ్య నెలకొంటున్న సన్నిహిత సంబంధాలపై చైనా జాగ్రత్తపడుతుందని తెలుస్తోంది. భారత దేశానికి దగ్గరకావాలని చైనా ఆరాటపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగా కైలాష్, మానససరోవర్ యాత్రలు సులభతరం చేస్తాము రమ్మంటూ భారత ప్రజలకు ఆహ్వానాలు పలుకుతోంది.
ప్రస్తుతం ఉత్తరాఖండ్ నుంచి కైలాష్ యాత్రకు ఏటా వెయ్యి మందిని అనుమంతీస్తోంది భారత ప్రభుత్వం. అయితే, వర్షాలు పడేటప్పుడు మాత్రం ఈ యాత్ర పూర్తి చేయాలంటే ప్రాణాలకు తెగించే కష్ట తరమవుతోంది. ఇదే విధంగా, నేపాల్ దేశం నుంచి కూడా యాత్ర కష్టసాధ్యం కావడంతో కైలాష్, మానససరోవర్ యాత్రకు మరో ప్రత్యామ్యాయం చూడాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో ఆలోచిస్తోంది.
అందులో భాగంగా, జూలైలో ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జి.జిన్ సింగ్ తో సమావేశమైనప్పుడు ఈ విషయం గురించి చర్చించారు. అప్పుడు జి.జిన్ సింగ్ తన శక్తి మేర చేయగలిగింది చేస్తానని చెప్పారు.
ఇప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనలోనున్న చైనా… కైలాష్, మానససరోవర్ యాత్రలు సులభతరంకైలాష్ యాత్రను సులభతరం చేయనున్న చైనా చేస్తామని భారత భక్తులను రమ్మని ఆహ్వానిస్తోంది. కైలాష్, మానస సరోవార్ లకు చైనా నుంచి కూడా మార్గం ఉంది. అయితే, ఇప్పటివరకు చైనా నుంచి కైలాష్, మానస సరోవర్ కి పరిమిత సంఖ్యలో మాత్రమే వెళ్తున్నారు.
చైనా సిక్కిం నుంచి ఎంతో సులభతరమైన కైలాష్, మానస సరోవర్ యాత్రలకు భారత భక్తులను రప్పించడానికి చైనా ఇప్పుడు పావులు కదుపుతోంది. భారతదేశం జపాన్ దేశానికి దగ్గరవుతోన్న నేపథ్యంలో చైనా…. కైలాష్, మానస సరోవర్ ప్రాంతాలకు వేల మంది భక్తులని చేర్చే ప్లాన్ ద్వారా భారత దేశానికి దగ్గర కావాలని చూస్తోంది.
No comments:
Post a Comment