Sunday 14 September 2014

డేవిస్ కప్: సోమ్‌దేవ్ సంచలనం, భారత్‌కు ఊపిరి

బెంగళూరు: డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌లో సోమ్‌దేవ్ వీరుడిలా పోరాడి యుకి బంబ్రీపై సంచలన విజయం సాధించాడు.భారత్‌కు సెర్బియాను ఓడించి ముందంజ వేయడం సాధ్యమా కాదా అన్నది వర్షం కారణంగా స్పష్టం కాలేదు. అత్యంత కీలకమైన చివరి రివర్స్ సింగిల్స్‌లో యుకీ భంబ్రీ ఒ సెట్ వెనుకంజలో నిలవగా, వర్షం వల్ల ఆటను ఆపేశారు. అర్ధరాత్రి వరకు మ్యాచ్ మళ్లీ మొదలు కాలేదు. మొదటి రెండు సింగిల్స్ మ్యాచ్‌లను చేజార్చుకొని 0-2 తేడాతో వెనుకబడిన భారత్‌ను డబుల్స్ విభాగంలో లియాం డర్ పేస్, రోహన్ బొపన్న విజయంతో ఆదుకున్నారు. ఆదివారం నాటి రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌ల ను గెలిస్తే తప్ప సెర్బియాను ఓడించి వరల్డ్ గ్రూప్ పోటీలకు అర్హత సంపాదించలేని స్థితిలో ఉన్న డేవిస్ కప్: సోమ్‌దేవ్ సంచలనం, భారత్‌కు ఊపిరిభారత్‌కు సోమ్‌దేవ్ దేవ్‌వర్మ అండగా నిలిచాడు. దుసాన్ లజొవిక్‌తో జరిగిన మ్యాచ్‌ని అతను 1-6, 6-4, 4-6, 6-3, 6-2 తేడాతో సంచలన విజయాన్ని సాధించి స్కోరును సమం చేశాడు. సెర్బియాతో సమానంగా రెండు విజయాలను సాధించిన భారత్‌కు చివరి రివర్స్ సింగిల్స్ మ్యాచ్ కీలకంగా మారింది. అంతకు ముందు సింగిల్స్ మ్యాచ్‌లో సోమ్‌దేవ్‌ను ఓడించిన ఫిలిప్ క్రగజినొ విచ్‌తో యుకీ భంబ్రీ తలపడ్డాడు. అయతే, తీవ్రమైన ఒత్తిడికి లోనైన అతను మొదటి సెట్‌ను 3-6 తేడాతో కోల్పోయాడు. రెండో సెట్‌లో ఇరువురు చెరి నాలుగు పాయంట్లు సంపాదించారు. ఈ దశలో వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది.

No comments:

Post a Comment