Wednesday 17 September 2014

చెత్తకుండీలో ఉక్రెయిన్ ఎంపీ...

ఉక్రెయిన్ ప్రజల్ని చూసి మన దేశ ప్రజలు చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే మన దేశంలో ప్రజా ప్రతినిధులు పనులు చేయకపోయినా, అవినీతికి పాల్పడుతున్నా జనం అతగాడి పదవీకాలం ముగిసేవరకూ దిగులు ముఖాలు వేసుకుని చూడ్డం తప్ప మరేమీ చేయలేరు. అయితే ఉక్రెయిన్ ప్రజలు అలా కాదు. వాళ్ళు టైమ్ వేస్ట్ చేయరు.. పనికిమాలిన నాయకులను అస్సలు స్పేర్ చేయరు. ఉక్రెయిన్‌లో విటలీ జురవ్ స్కీ అనే ఎంపీ వున్నాడు. ఆయన ఎంపీగా గెలిచినప్పటి నుంచి ప్రజలకు ముఖం చూపించిన పాపాన పోలేదు. ప్రజల సమస్యలను పట్టించుకున్న పుణ్యానా పోలేదు. ఆయనగారి నియోజకవర్గం ప్రజలు చూశారూ చూశారు.. చివరికి పార్లమెంట్ ఎదురుగానే ఆయనకు ఘన సత్కారం చేశారు. మీతో మాట్లాడాలి సార్ అని పార్లమెంట్ నుంచి బయటకి పిలిచి, తమ దగ్గరకి వచ్చిన ఆయన్ని గట్టిగా పట్టుకుని మోసుకెళ్ళి పార్లమెంట్ ముందు వున్న చెత్తకుండీలో పారేశారు. చెత్తకుండీలోంచి బయటకి లేవబోయిన ఆయన మీదపడి అందరూ ఆయన్ని చెత్తకుండీలో మరింత లోపలకి నెట్టేశారు. పోలీసులు వచ్చి ఆయన్ని చెత్తకుండీలోంచి బయటకి తీశారు. తన నియోజకవర్గ ప్రజలు ఈ రకంగా అవమానించాక ఆయన ఊరుకున్నారా? ఆ మురికిబట్టలతోనే పార్లమెంట్‌ లోపలకి వెళ్ళి తన ఎంపీ పదవికి రాజీనామా చేసేశాడు. మనమూ వున్నాం

!

No comments:

Post a Comment