Friday 19 September 2014

జిన్‌ పింగ్‌తో నరేంద్ర మోడీ దౌత్యం: వెనక్కు తగ్గిన చైనా బలగాలు

china army
భారత పర్యటనలో ఉన్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెరపిన దౌత్యం ఫలించింది. ఫలితంగా భారత భూభాగంలోకి హద్దుమీరి ప్రవేశించిన చైనా బలగాలు శుక్రవారం వెనక్కితగ్గాయి. దీంతో గత నాలుగు రోజులుగా నెలకొనివున్న ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగాయి. 
 
జమ్మూ కాశ్మీర్‌లోని ఈశాన్య లడఖ్‌లోని చూమర్ ప్రాంతంలో సరిహద్దుల్లోకి గత నాలుగు రోజుల క్రితం చైనా బలగాలు అక్రమంగా చొచ్చుకొచ్చిన విషయం తెల్సిందే. చైనా అధినేత భారత పర్యటనకు వచ్చిన రోజునే ఈ దురాక్రమణ చర్యలు జరిగాయి. అలాగే, గురువారం ఉదయం రెండుదఫాలుగా భారత భూభాగంలోకి ప్రవేశించి దాదాపు 600 మంది చైనా సైనికులు గుడారాలు వేసుకున్నారు. వారికి చైనా హెలికాప్టర్లు క్రమం తప్పకుండా ఆహారం, తాగునీరు సరఫరా చేస్తూ వచ్చాయి. 
 
సరిహద్దు దాటివచ్చారని, వెనుకకు పోవాలని భారత సైనికులు మొదట సూచించినప్పటికీ చైనా సైనికులు నిరాకరించారని భారత సైనికవర్గాలు పదేపదే హెచ్చరించినా పెడచెవిన పెట్టారు. అయితే గురువారం రాత్రి 9.45 నుంచి వారి భూభాగంలోకి వెనక్కి మరలడం ప్రారంభించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో అక్కడ భారీ సంఖ్యలో మోహరించిన భారత సైనికులు కూడా క్రమంగా తమ సంఖ్యను తగ్గించుకుంటున్నారు. అంతకుముందు చొరబాటును సీరియస్‌గా తీసుకున్న భారత ప్రభుత్వం అక్కడకు మరింతమంది సైనికులను పంపింది. 
 
భారత్ - చైనా సరిహద్దుల్లో చైనా సైన్యం పదేపదే చొరబాట్లకు పాల్పడటంపై భారత్ ఆందోళనను జిన్‌పింగ్‌కు తెలిపామని ప్రధాని మోడీ చెప్పారు. రెండు దేశాల మధ్య బలమైన సంబంధాల కోసం సరిహద్దుల్లో

No comments:

Post a Comment