Wednesday 17 September 2014

జూన్ నాటికి ఎగరనున్న టాటా-సియా విమానాలు

న్యూఢిల్లీ/హైదరాబాద్: వచ్చే ఏడాది మే-జూన్ నాటికి విమానాలను ప్రారంభించనున్నట్లు టాటా- సియా ఎయిర్ లైన్స్ ఛైర్మన్ ప్రసాద్ మీనన్ వెల్లడించారు. టాటా-సియా(సింగపూర్ ఎయిర్‌లైన్స్) జాయింట్ వెంచర్ ద్వారా విమాన కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా విదేశీ పెట్టుబడుల ప్రగతి బోర్డు (ఎఫ్‌ఐపిబి) గురువారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇక్కడ టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా, సియా సిఈఓ గో చూన్ ఫాంగ్.. కేంద్ర పౌరవిమానయాన మంత్రి అజిత్ సింగ్‌ను కలిశారు. 45 నిమిషాలపాటు అజిత్ సింగ్‌తో వీరు సమావేశమయ్యారు. వీరితోపాటు అజిత్ సింగ్‌ను కలిసిన టాటా సియా ఎయిర్‌లైన్స్ చైర్మన్ ప్రసాద్ మీనన్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. విమానాలను ప్రారంభించేందుకు త్వరితగతిన అనుమతులు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మే-జూన్‌లో విమాన కార్యకలాపాలు ప్రారంభమవుతాయని భావిస్తున్నామని ఆయన తెలిపారు. కాగా, దేశీయ విమానయాన రంగంలో టాటా-సియా ఎయిర్‌లైన్స్ లాభాల బాటలో నడవగలవనే ఆశాభావాన్ని అజిత్ సింగ్ వ్యక్తం చేశారు. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు సాంకేతికత, నిర్వహణ విషయాల్లో ఉన్న అనుభవం ప్రపంచానికి తెలుసని, ప్రపంచంలోని ఉత్తమ ఎయిర్‌లైన్స్‌లలో 
జూన్ నాటికి ఎగరనున్న టాటా-సియా విమానాలు

సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఒకటని ఈ సందర్భంగా ఆయన అన్నారు. పౌర విమానయానానికి సంబంధించి ముఖ్యమైన అనుమతులు ఎప్పుడు ఇస్తారన్న ప్రశ్నకు బదులుగా ఎలాంటి సమస్యలు లేవని, టాటా-సియా వెంచర్ పట్ల డిజిసిఎ కూడా సంతృప్తికరంగా ఉందన్నారు. అయితే పార్కింగ్ ప్లేస్, స్లాట్లు, రూట్లకు సంబంధించి కొన్ని అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని, సంబంధిత డాక్యుమెంట్లు, డేటా ఎంత తొందరగా టాటా-ఎస్‌ఐఎ అందిస్తే అంత త్వరగానే ఇవి పరిష్కారమవుతాయని ఆయన చెప్పారు. టాటా-సియా వెంచర్‌పై అజిత్ సింగ్ అభిప్రాయం పట్ల రతన్ టాటా సంతోషం వ్యక్తం చేశారు. వారు గర్వించేలా ఎయిర్‌లైన్స్‌ను నడిపే బాధ్యత తమపై ఉందన్నారు. సియాతో కలిసి టాటా సన్స్ ఎయిర్‌లైన్స్ కార్యకలాపాల్లోకి రావడం గొప్ప అవకాశంగా ఆయన అభివర్ణించారు. హైదరాబాద్‌లో విప్రో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ హైదరాబాద్: దేశీయ ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన విప్రో.. మొబైల్ తయారీకి అవసరమైన సాఫ్ట్‌వేర్ అందించే సంస్థ కోనీతో కలిసి హైదరాబాద్‌లో మొబిలిటి సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. మెరుగైన మొబైల్ యాప్స్‌ని తీర్చిదిద్దేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడగలదని పేర్కొంది. కోనీకి చెందిన క్లౌడ్ ఆధారిత మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ ప్లాట్ ఫాంపై రూపొందిన వివిధ యాప్స్‌ని 45దేశాల్లో దాదాపు 2కోట్ల మంది వినియోగిస్తున్నట్లు విప్రో తెలిపింది.

No comments:

Post a Comment