Tuesday 23 September 2014

మార్గదర్శకానకిలీ ఎన్‌కౌంటర్లపై సుప్రీం కోర్టు ఆగ్రహంపోలీస్‌ ఎన్‌కౌంటర్లపై కొత్త


న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 23 : నకిలీ ఎన్‌కౌంటర్లపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం ఉదయం నకిలీ ఎన్‌కౌంటర్లకు సంబంధించిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై సుప్రీం కోర్టు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. నకిలీ ఎన్‌కౌంటర్లని తేలితే సంబంధిత అధికారులకు ప్రమోషన్లను నిలిపివేయడంతో పాటు వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతన్యాయస్థానం స్పష్టం చేసింది. ఎన్‌కౌంటర్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి న్యాయవిచారణకు ఆదేశించాలని కోర్టు పేర్కొంది.
 
నకిలీ ఎన్‌కౌంటర్ల విచారణను సీఐడీ ద్వారానే చేపట్టాలని స్పష్టం చేసింది. ఎన్‌కౌంటర్‌ వివరాలను రాతపూర్వంగా లేదా ఎలక్ర్టానిక్‌ విధానంలో నమోదు చేయాలని సుప్రీం తెలిపింది. ఎన్‌కౌంటర్‌లో వాడిన మందుగుండు సామాగ్రిని పరీక్షలకు పంపాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన న్యాయవిచారణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, ఆరోపణలు ఎదుర్కుంటున్న సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్‌ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

No comments:

Post a Comment