Thursday 18 September 2014

మెట్రో రగడ, ఒక్కరి కోసం..: కేసీఆర్‌కు రేవంత్ సవాల్

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును వదులుకుంటున్నట్లు ఎల్ అండ్ టీ సంస్థ ప్రకటించడం, ప్రభుత్వంతో చర్చల తర్వాత తిరిగి పనులు కొనసాగిస్తామని చెప్పిన నేపథ్యంలో తాను చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలితే, తనపై కేసులు పెట్టుకోవచ్చని తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలో ఎల్ అండ్ టీకి కేటాయించిన 32 ఎకరాల భూమిని ఒకరికి ప్రభుత్వం బదిలీ చేసిందన్న తన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని ఆయన గురువారం ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ భూముల బదలాయింపు వల్లనే ఎల్ అండ్ టీ, ప్రభుత్వం మధ్య విభేదాలు పొడచూపాయని కూడా రేవంత్ చెప్పారు. కేవలం ఓ వ్యక్తి ప్రయోజనాల కోసం, మెట్రో రైలు ప్రాజెక్టునే వదులుకునేందుకు ప్రభుత్వం సిద్ధపడిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ విశ్రాంతి తీసుకోవడానికి నందగిరి గడిని ఇస్తు్నన దొరకి దోచిపెట్టడానికి మెట్రో రైలు ప్రాజెక్టును పణంగా పెడతారా అని రేవంత్ బుధవారం విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. గచ్చిబౌలీలో మెట్రో ప్రాజెక్టు మల్టీలెవల్ పార్కింగ్ కోసం ఇచ్చిన 31.5 ఎకరాల స్థలాన్ని నందగిరి దొరకు ఇచ్చి ప్రభుత్వం ఎల్ అండ్ టీ సంస్థను మెడపట్టి బయటకు నెట్టే ప్రయత్నం చేసిందన్నారు. ఆ స్థలంపై ఇప్పటికే సదరు దొరకు చెందిన సంస్థకు ముందస్తు పొజిషన్ సైతం ఇచ్చిందన్నారు.

No comments:

Post a Comment