Tuesday 23 September 2014

టీ రైతులకు శుభవార్త

telangana
చాలా కాలంగా రుణమాఫీ కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్న రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసేందుకు మరో అడుగు ముందుకు వేసింది. ఎన్నికల హామీల్లో భాగంగా తెరాస ప్రభుత్వం రైతుల రుణమాఫీ కోసం 17 వేల కోట్లు 
కేటాయించేందుకు సిద్ధమయ్యింది. అందులో భాగంగా ఇప్పటికే 4250 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. రుణమాఫీ కోసం ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం తాజాగా తమ నివేదికను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేయడం జరిగింది.
తెలంగాణ ప్రభుత్వం రైతుల రుణమాఫీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో పాటు ఖరీఫ్‌ కోసంగాను రైతులకు కొత్త రుణాలు ఇవ్వాల్సిందిగా
 బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన వారికి మాత్రమే రుణమాఫీ వర్తించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నకిలీ పాసు పుస్తకాలు పెట్టి రుణం తీసుకున్న వారికి ఈ రుణమాఫీ వర్తించదని, వారిపై చర్యలు కూడా తీసుకోబోతున్నట్లు మంత్రులు వెళ్లడిరచారు. వాణిజ్య పంటలైన మిరప, చెరకు పండిరచేందుకు రైతులు తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేయబోతున్నట్లు మంత్రులు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటనతో రైతుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది

No comments:

Post a Comment