Thursday 18 September 2014

స్కాట్లాండ్‌లో కొనసాగుతున్న రెఫరెండం కౌంటింగ్!

స్కాంట్లాండ్ లో రెఫరెండం కౌంటింగ్ కొనసాగుతోంది. గ్రేట్ బ్రిటన్ నుంచి స్వతంత్ర సత్తాహక దేశంగా ఏర్పడే అంశంపై 32 జిల్లాల్లో ఈ రిఫరెండం నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకూ ఏడు జిల్లాల్లో తమకు స్వాతంత్ర్యం వద్దంటూ ఫలితాలు రాగా, ఒక్క జిల్లాలో మాత్రం అనుకూలంగా ఫలితం వెలువడింది. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపిన స్కాట్లాండ్ రెఫరెండంపై పూర్తిస్థాయి ఫలితాలు మరికొన్ని గంటల్లో వెల్లడి కానున్నాయి. 
 
బ్రిటన్, స్కాట్లాండ్ దేశాల మధ్య అసమానతలు ఉన్నాయి. స్కాట్లాండ్‌లో నాలుగు దశాబ్దాల కిత్రం భారీగా బయటపడిన ఆయిల్ నిల్వలు.. ఇవి స్కాట్ ప్రజలను స్వతంత్రత వైపు ఆలోచించేలా చేశాయి. ఆర్థిక, ఆరోగ్య, సంక్షేమ రంగాల్లో బ్రిటన్ ప్రభుత్వం చూపిన వివక్ష, ప్రబలిన నిరుద్యోగం.. స్కాట్ ప్రజల్లో స్వాతంత్ర్యకాంక్షను మరింతగా పెంచాయి. ఇరాక్, ఆప్ఘనిస్థాన్‌లలో బ్రిటన్ యుద్ధాల్లో పాల్గొనడం కూడా స్కాట్ వాసులకు ఏమాత్రం ఇష్టంలేదు. 
      
ముఖ్యంగా.. బ్రిటన్ చమురు ఉత్పత్తుల్లో దాదాపు 90 శాతం స్కాట్‌లాండ్ నుంచే వస్తున్నప్పటికీ.. ఆ స్థాయిలో తమకు వనరుల కేటాయింపు లేకపోవడం స్కాట్ ప్రజలను మరింతగా ఆలోచింపజేసింది. చమురు నిల్వలు, ఇతర సహజవనరులతో స్వతంత్రదేశంగా మరింత అభివృద్ధిని సాధించగలమని సాల్మండ్ వంటి నేతలు వివరిస్తుండటంతో వారిలో ఆశలు చిగురించాయి. అందుకే ఈ రెఫరెండం నిర్వహిస్తున్నారు. 

No comments:

Post a Comment