Friday 19 September 2014

తప్పుగా జింగ్ పింగ్ పేరు..ఊడిన న్యూస్ రీడర్ ఉద్యోగం..

ఒకే ఒక తప్పు..తీవ్ర దుమారం రేపింది. ఒకే ఒక తప్పు కదా ఏం మునిగిపోయింది. మళ్లీ సరిదిద్దుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారా ? కాదే కాదు అంటున్నారు ఇతరులు. అసలు ఏవరు తప్పు చేశారు ? ఏంటా తప్పు అనుకుంటున్నారా ?
చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ ద్వైపాక్షిక సంబంధాలకు గట్టి పునాది వేసేందుకు మన దేశంలో పర్యటించారు. యావత్ ప్రపంచమంతా ఆయన పర్యటనపైనే దృష్టి కేంద్రీకరించింది. జాతీయ..అంతర్జాతీయ..ఇతర మీడియా సంస్థలు ఆయన గురించి ప్రముఖంగా వార్తలు ప్రసారం చేశాయి..ప్రచురించాయి కూడా.
జి జిన్ పింగ్ పేరును తప్పుగా చదివిన ప్రజెంటర్..
కానీ ఓ దూరదర్శన్ న్యూస్ ప్రజెంటర్ మాత్రం జి జిన్‌పింగ్‌ పేరును తప్పుగా ఉచ్చరిస్తూ వార్తలు చదివేసింది. జి జిన్‌పింగ్‌ పేరు XI అనే ఇంగ్లీషు అక్షరాలతో మొదలవుతుంది. ఈ రెండు ఇంగ్లీషు అక్షరాలకు కలుపుకుని జి జిన్‌పింగ్‌ అని చదవాలి. కానీ XI అనే ఇంగ్లీష్ అక్షరాలను రోమన్‌ అంకెలుగా భావించిన న్యూస్‌ రీడర్‌ పదకొండవ జిన్‌పింగ్‌ అని అలవోకగా చదివేసింది. ఇది ఆ నోటా ఈనోటా విన్న చైనా అధికారులు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసారు.
తప్పు క్షమించరానిదే..
తీరా అసలు విషయం తెలిసే సరికి న్యూస్‌ రీడర్‌ ఉద్యోగం ఊడింది. అయితే న్యూస్‌ రీడర్ల కొరత కారణంగానే ఈ తప్పు జరిగిందని దూరదర్శన్‌ అధికారులు చెప్తున్నారు. అనుభవం ఉన్న ఉద్యోగస్తులు లేని కారణంగా సాధారణ ఉద్యోగులతో వార్తలు చదివించామని వివరణ ఇచ్చుకున్నారు. ఏది ఏమైనప్పటికి ఇది క్షమించరానిదని ఇటువంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటామని దూరదర్శన్‌ యాజమాన్యం హామీ ఇచ్చింది. ఎవరెంత చెప్పినా చైనా అధ్యక్షుని అధికారగణం మాత్రం కోపం తగ్గించుకోలేదు. బాధ్యత కల్గిన మీడియానే ఇలా తప్పులు చేస్తే ఎలా అంటూ చురకలు అంటిస్తున్నారు.

No comments:

Post a Comment