Monday 22 September 2014

బతుకమ్మ: మహిళలతో రోడ్డుపై విహెచ్

హైదరాబాద్: అంబర్‌పేట బతుకమ్మకుంటను కబ్జాదారుల బారి నుంచి రక్షించి, కుంటను అభివృద్ది చేయాలని రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బతుకమ్మకుంట భూములను పరిరక్షించాలని కోరుతూ ఆయన ఆదివారం కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలతో కలిసి అంబర్‌పేట శ్రీరమణ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈస్ట్‌జోన్ అడిషనల్ డీసీపీ ఎల్‌టీ చంద్రశేఖర్, మలక్‌పేట ఏసీపీ సుధాకర్, అంబర్‌పేట ఇన్‌స్పెక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ధర్నా చేస్తున్న విహెచ్‌ను, పార్టీ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో వి.హనుమంతురావు మాట్లాడుతూ కుంటలో బతుకమ్మలను నిమజ్జనం చేయడం వల్లే బతుకమ్మకుంట అని పేరు వచ్చిందని, ఇలాంటి బతుకమ్మకుంటపై కొంతమంది కబ్జాదారులు కన్నేసి, నకిలీ డాక్యూమెంట్లు సృష్టించి మట్టితో కుంటను పూడ్చి వేసి కబ్జా చేశారని ఆరోపించారు. 

No comments:

Post a Comment