Wednesday 17 September 2014

లైంగికవేధింపులకు పాల్పడిన ప్రిన్సిపాల్ అరెస్టు

లైంగికవేధింపులకు పాల్పడిన ప్రిన్సిపాల్ అరెస్టుహైదరాబాద్ : తాను ప్రిన్సిపాల్ గా ఉన్న కళాశాలలో పనిచేస్తున్న ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ ప్రాంతంలోని నారాయణ విద్యా సంస్థలకు చెందిన వాగ్దేవి జూనియర్ కళాశాలలో ప్రభు శ్రీనివాస్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు.

అదే కళాశాలలో పనిచేస్తున్న ఓ యువతి (21)ను అతడు గత పది రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడు. ఆమె ఎట్టకేలకు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రభు శ్రీనివాస్ ను అరెస్టు చేశారు.

No comments:

Post a Comment