Sunday 21 September 2014

'లైంగిక్ వేధింపుల' కేసులో బుక్కైన ఆమ్ ఆద్మీ పార్టీ నేత

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ మయాంగ్ గాంధీపై క్రిమినల్ కేసు నమోదైంది. మహిళా కార్యకర్తపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో మయాంక్ గాంధీతో పాటు మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత లోక్ సభ ఎన్నికలకు ముందు ఏప్రిల్ నెలలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త తరుణ్ సింగ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పిడినట్లు ఓ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ రోజు లైంగిక వేధింపులకు ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ మయాంక్ గాంధీతో పాటు ఐదుగురి ప్రయేయం ఉందని పోలీసు ఫిర్యాదులో పేర్కొంది. లైంగిక ఆరోపణలకు కారకుడైన తరుణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల చట్టం క్రింద 354 సెక్షన్, మహిళలను అగౌరవపరిచాడనే ఆరోపణల క్రింద 509 సెక్షన్ల నమోదు చేయగా, మిగతా ఐదుగురిపై కూడా కేసు నమోదు చేసినట్లు అడిషనల్ కమీషనర్ మిలింద్ భరాంబే తెలిపారు. దీనిపై బాధితురాలు శనివారం పోలీసుల్ని ఆశ్రయించినట్లు తెలిపారు. పార్టీలో ఉన్న కొంతమంది మహిళా కార్యకర్తలతో అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. శుక్రవారం రాత్రి వరకూ ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదని డిప్యూటీ కమీషనర్ (జోన్-9) సత్య నారాయణ్ చౌధురీ తెలిపారు. ఇది ఇలా ఉంటే ఆ మహిళా కార్యకర్త చేసిన ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ నేత మయాంక్ గాంధీ ఖండించాడు.

No comments:

Post a Comment