Wednesday 17 September 2014

వరద బాధితులకు రూ. 20 కోట్లు: రాహుల్ బజాజ్

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ వరద బాధితులకు ప్రముఖ వాహన తయారీ సంస్ద బజాజ్ ఆటో తన వంతు సహాయం అందించనుంది. ప్రధాని జాతీయ సహాయ నిధికి తన వంతుగా రూ. 20 కోట్ల విరాళం ప్రకటించింది. భారీ వర్షం, వరదలు కారణంగా అతలాకుతలమైన జమ్మూ కాశ్మీర్ వాసులను ఆదుకోవాలని భావించి ఈ సహాయం చేస్తున్న బజాజ్ ఆటో ఛైర్మన్ రాహుల్ బజాజ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ వరద బాధితులకు సహాయార్దం ప్రధాని జాతీయ సహాయ నిధికి విరాళాలు ఇవ్వాల్సిందిగా యావత్ దేశాన్ని కోరిన సంగతి తెలిసిందే. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టే పునరావాస చర్యల్లోనూ తాము భాగస్వాములవుతామని ఆయన హామీ ఇచ్చారు.

No comments:

Post a Comment