Thursday 18 September 2014

స్కాట్లాండ్‌ రెఫరెండంలో అనూహ్య పరిణామాలు విభజనను వ్యతిరేకిస్తున్న 26 జిల్లాల ప్రజలు

స్కాట్లాండ్‌ , సెప్టెంబర్‌ 19 : స్కాట్లాండ్‌ రెఫరెండంలో అన్యూహ్య పరిణామాలు ఎదురువుతున్నాయి. స్వాంతంత్య్రకాంక్షతో ఉద్యమం ప్రారంభించిన వారికి ఓటర్లు ఝలక్‌ ఇచ్చారు. దేశ విభజనకు 26 జిల్లాల ప్రజలు విముఖత చూపుతున్నారు. యూకేలో స్కాట్లాండ్‌ కొనసాగాలా వద్దా అన్న అంశంపై ప్రజాభిప్రాయసేకరణ జరిగింది. ఆ వెంటనే కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది.
 
ఈ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనడానికి 42లక్షల మందికిపైగా స్కాట్లాండ్‌ పౌరులు దరఖాస్తు చేసుకున్నారు. 16ఏళ్ల వయసు నిండిన స్కాట్‌ పౌరులందరూ ఈ రెఫరెండంలో పాల్గొనడానికి అర్హులే. అక్కడ మొత్తం 32 జిల్లాలు ఉండగా నాలుగు జిల్లాలు మినహా మిగిలిన 26 జిల్లాల ప్రజలు యునైటెడ్‌ కింగ్‌డమ్‌ నుంచి విడిపోయేందకు విముఖంగా చూపుతున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 54 శాతం మంది స్కాట్‌ ప్రజలు దేశ విభజనను వ్యతిరేకిస్తుండగా 45 శాతం మంది మాత్రమే అనుకూలంగా ఉన్నారు.

No comments:

Post a Comment