Hero Sivaji kandireega.comహీరో శివాజీ తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్ష పదవిపై కన్నేశాడని తెలుస్తోంది. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శివాజీ తనకు టీటీడీ పదవి వస్తుందని నమ్మకంగా చెప్పాడు. అయితే, పదవి కోసం తాను పైరవీలు చేయనని, పదవే తనను వెదుక్కుంటూ వస్తుందని కూడా శివాజీ వ్యాఖ్యలు చేశాడు. మొత్తానికి, హీరో శివాజీ టీటీడీ చైర్మన్ రేసులో తానున్నానంటూ ప్రకటించాడు. బీజేపీ కూడా ఈ మేరకు శివాజీకి హామీ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది.
ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ పదవిపై హీరో శివాజీ ఈ విధంగా స్పందించడం టీడీపీ నాయకులలో కలకలం మొదలయ్యేలా చేసిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
కనుమూరి బాపిరాజు టీటీడీ ఛైర్మన్ పదవిలోనే కొనసాగాలని ఆశపడుతున్నారట. అయితే, అధికారంలోకి వస్తూనే నారా చంద్రబాబునాయుడు… చదలవాడకు టీటీడీ చైర్మన్ పదవిని ఇస్తానని హామీ ఇచ్చారు. కాని, అది ఇంతవరకు కార్యరూపం దాచలేదు. ఐనప్పటికీ, టీడీపీ వర్గాలు టీటీడీ చైర్మన్ పదవి చదలవాడదేనని గట్టగా వాదిస్తున్నారు.
మరో పక్క నగరి మాజీ ఎమ్మెల్యే గాలి ముద్దు కృష్ణమనాయుడు, ఎంపీ రాయపాటి సాంబశివరావు, మాగంటి మురళీమోహన్ తిరుపతి వెంకన్నకు సేవ చేయాలని తహతహలాడుతున్నారట. ఈ నేపథ్యంలో.. ఆగస్టులో టీటీడీ పాలక మండలిని రద్దు చేశారు. పాత పాలక“పదవి కోసం పైరవీలు చేయను” మండలిని రద్దు చేసి నెలన్నర కావస్తున్నా ఇప్పటివరకు కొత్త పాలకమండలిని నియమించలేదు. ఈ నేపథ్యంలో హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.