Wednesday 17 September 2014

శారదా స్కామ్‌: మాజీ డీజీపీ ఆత్మహత్య... పిస్తోలుతో కాల్చుకుని...

వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని ఓ కుదుపు కుదుపుతున్న శారదా స్కామ్‌లో ఒక అనుమానితుడిగా భావిస్తున్న అస్సా మాజీ డీజీపీ శంకర్ బారువా తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. గౌహతిలోని తన నివాసంలోనే ఆయన ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. 
 
శారదా స్కామ్‌కు సంబంధించిన సీబీఐ అధికారులు రెండు వారాల క్రితం గౌహతిలో ఏకకాలంలో 12 ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా శంకర్ బారువా ఇంటిలో కూడా సోదాలు నిర్వహించారు. అదేసమయంలో శంకర్ బారువా నివాసంలో కూడా సోదాలు జరిపారు. ఆ తర్వాత ఆయన వద్ద విచారణ కూడా జరిపారు. దీన్ని అవమానంగా భావించిన ఆయన... తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెపుతున్నారు. 
 
కాగా, బారువా రివాల్వర్‌తో కాల్చుకుని మరణించినప్పుడు 90 ఏళ్ల వయస్సు గల ఆయన తల్లి కూడా ఇంట్లోనే ఉన్నట్టు సమాచారం. గత నాలుగు రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్న బారువా బుధవారమే ఇంటికి తిరిగి వచ్చారు. విచారణలో సీబీఐ అధికారులు అవమానించినందుకు మనస్తాపానికి గురయ్యారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శారదా చిట్‌ఫండ్స్ కుంభకోణంలో సిబిఐ 48 కేసులు నమోదు చేసింది. పశ్చిమ బెంగాల్‌లో నాలుగు కేసులు, ఒడిషాలో 44 కేసులు నమోదు చేసింది. 

No comments:

Post a Comment