Friday 19 September 2014

స్కాట్లాండ్‌లో గెలిచిన సమైక్యవాదం

స్కాట్లాండ్‌లో సమైక్యవాదం గెలిచింది. బ్రిటన్‌లోనే కొనసాగాలా, ప్రత్యేక దేశంగా విడిపోవాలా అనే అంశం మీద గురువారం నాడు భారీ స్థాయిలో జరిగిన రిఫరెండం‌లో మెజారిటీ ప్రజలు బ్రిటన్‌లోనే కొనసాగాలన్న నిర్ణయాన్ని వెలిబచ్చారు. దాంతో మూడు వందల సంవత్సరాలుగా బ్రిటన్లో అంతర్భాగంగా వున్న స్కాట్లాండ్ ఇకముందు కూడా బ్రిటన్‌లోనే కొనసాగనుంది. ఈ రెఫరెండంతో ఇంతకాలం కొనసాగుతూ వచ్చిన విభజన ఉద్యమాలకు ఫుల్‌స్టాప్ పడే అవకాశాలున్నాయి. ఒకవేళ విభజన కోరుతూ నిర్ణయం వస్తే అది బ్రిటన్ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసేది. ఇప్పటి దాకా వెలువడిన రిఫరెండం ఫలితాల్లో దేశ విభజన వద్దంటూ 55 శాతం మంది ఓటేశారు. 45 శాతం మంది ప్రత్యేకం దేశం కావాలని కోరుతూ ఓటేశారు.ఈ ఫలితాలను బట్టి బ్రిటన్‌ భవితవ్యానికి ఢోకా ఉండకపోవచ్చని అంతర్జాతీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు

No comments:

Post a Comment