Sunday 21 September 2014

అంబర్‌పేటలో బతుకమ్మ ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది

హైదరాబాద్‌: అంబర్‌పేటలో బతుకమ్మ ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. బతుకమ్మకుంటను కాపాడాలంటూ అంబర్‌పేట్‌ మహంకాళి ఆలయం నుంచి.. బతుకమమ్మ కుంట వరకు రాజ్యసభ సభ్యులు వి. హనుమంతరావు మహిళలతో చేపట్టిన భారీ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మహిళలు రోడ్డుపైనే బతుకమ్మ ఆడడంతో.. అంబర్‌పేట ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు భారీ అంతరాయం కలిగింది. ర్యాలీకి అనుమతి లేదంటూ వారిని అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు.. వీహెచ్‌కు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో ఆయన అక్కడే బైఠాయించారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు. టిఆర్ ఎస్ ప్రభుత్వం చెరువులను, కుంటలను, భూములను భూ బకాసురుల నుంచి కాపాడాలని కేసీఆర్ ను కోరారు. ఆ తరువాత ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి.. స్టేషన్‌కి తరలించారు.

No comments:

Post a Comment