Friday 19 September 2014

అల్లు అర్జున్ వదినగా స్నేహా ?

ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఆ చిత్రంలో ఇటీవలే వివాహామైన ప్రముఖ హీరోయిన్ స్నేహ ముఖ్య భూమిక పోషించనున్నారు. ఆ చిత్రంలో అల్లు అర్జున్ కు వదినా స్నేహ నటించనున్నారు. అయితే ఆ చిత్రంలో అల్లు అర్జున్ సోదరుడిగా, స్నేహాకు భర్తగా యాక్షన్ కింగ్ అర్జున్ నటించనున్నారు. కానీ ఆ చిత్రంలో నటించేందుకు అర్జున్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. సమంతా, అదా శర్మలు ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాధ్యమైనంత  త్వరలో ఈ చిత్రం తెరకెక్కనుందని సినీ పరిశ్రమ వర్గాల సమాచారం.

No comments:

Post a Comment